twitter review:భోళా శంకర్..బోర్ కొట్టిస్తుందా?

50
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ దర్శకుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ రోజు ( ఆగష్టు 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ ఈ గత చిత్రం వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయినప్పటికి ఆయన తరువాతి సినిమా భోళాశంకర్ పై ఎలాంటి హైప్ కనిపించలేదు. దీనికి కారణం ఈ సినిమా తమిళ్ లో అజిత్ నటించిన వేదాలమ్ మూవీకి రిమేక్ కావడం ఒక కారణం అయితే కంప్లీట్ కాగా ఫెడ్ అవుట్ అయిన మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకుడు కావడం మరో కారణం. ఇక రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి విడుదల అయిన టిజర్, ట్రైలర్, సాంగ్స్ వంటి వాటికి కూడా ఆశించిన స్థాయిలో ఆధారణ కనిపించలేదు. .

ఇన్ని ప్రతికూల పరిణామాల మద్య నేడు సినిమా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది అనే దానిపై చూసిన ఆడియన్స్ వారి అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. మూవీలో కథ చాలా ఫ్లాట్ గా ఉందని, ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. రొటీన్ మాస్ మసాలా మూవీ కావడంతో కథ చాలా బోరింగ్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయినది మొదలుకొని ఒక్క హై ఇచ్చే ముమెంట్ కూకూడా లేదంటూ చెబుతున్నారు ఆడియన్స్.

Also Read:పాడవోయి భారతీయుడా!

కథ విషయానికొస్తే హదరాబాద్ లో చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకునే శంకర్ ( చిరంజీవి ) తన చెల్లి మహలక్ష్మీ ( కీర్తి సురేశ్ ) పెద్ద చదువులకు కోల్కతా తీసుకెళతాడు. అక్కడ వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుండడంతో ఈ కిడ్నాప్ ల వెనుక ఎవరున్నారు ? శంకర్ ఈ కిడ్నాప్ ల గుట్టు ఎలా రట్టు చేశారు ? ఇంతకీ లాస్య ( తమన్నా ) కు శంకర్ ( చిరు ) కు మద్య పరిచయం ఎలా ఏర్పడింది. శంకర్ గతంలో ఏం చేసేవాడు ? ఇవన్నీ స్టోరీలోని కీ పాయింట్స్ అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. మూవీలో మెగాస్టార్ అక్కడక్కడ కామిడీ యాక్షన్ తో పరవలేదనిపించినప్పటికి స్టోరీ చాలా వీక్ కావడం, మెహర్ రమేశ్ డైరెక్షన్ ఫెలవంగా ఉండడం అతిపెద్ద మైనస్ అని మూవీ చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం టాక్ ను బట్టి చూస్తే మూవీ రొటీన్ కథతో మాస్ అంశాలు కలిగిన యావరేజ్ మూవీ అని చెబుతున్నారు ప్రేక్షకులు. మరి లాంగ్ రన్ లో మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Also Read:Tirumala:సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం

- Advertisement -