క్లైమాక్స్ కి చేరుకున్న భోళా శంకర్

44
- Advertisement -

తమిళ సినిమా వేదాలమ్ కి రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా చివరిదశకు చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ మూసాపేట ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ రాత్రిపూట చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి మెగాస్టార్ భోళా శంకర్ చిత్రం యాక్షన్ సీన్స్ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేశ్‌కు ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

ఈ యాక్షన్ సీన్స్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు కీర్తి సురేష్, సుశాంత్, మురళిశర్మ, రవిశంకర్ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలోని రెండు షేడ్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. పైగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాలో రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను మెహర్ రమేష్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. పైగా మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ తో ఈ ‘భోళా శంకర్’ రాబోతున్నాడు.

Also Read: WAR2:ఇంతకి హిరోయిన్‌ ఎవరో తెలుసా..!

మరి ఈ ‘భోళా శంకర్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఐతే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అన్నట్టు చిరు కెరీర్ లో ఈ సినిమా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఆగష్టు 11న తెలిసిపోనుంది.

Also Read: ‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ అప్పుడే

- Advertisement -