‘భోళా శంకర్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

97
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ పఫస్ట్ షోలు పడ్డాయి. ‘భోళా శంకర్’ సినిమా ఏవరేజ్ అని చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని తొలిసారి చిరంజీవి ఇమిటేట్ చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా భోళా మేనియా మాత్రం నెట్టింట్లో తగ్గింది. పైగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది అంటూ రివ్యూస్ పడుతున్నాయి.

అయితే, భోళా శంకర్ టాక్ ఎలా ఉన్న కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫస్ట్ డేకి దాదాపు రూ.60 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇప్పుడున్న బజ్ ను బట్టి సెకండ్ డే రూ.30 నుంచి 35 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. ఈ మూవీ.. ఓవరాల్‌గా ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి 100 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తోంది అని అంటున్నారు.

Also Read:ఓటీటీలోకి.. ‘హిడింబ’

అయితే ప్రస్తుతం భోళా శంకర్ సినిమా టాక్ పరిస్థితి బాగాలేదు, కనీసం ఈ సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ అయినా వస్తాయా ?, రావా ? అని మెగాస్టార్ చిరంజీవి సన్నిహితులు కూడా టెన్షన్ పడుతున్నారు. కారణం.. ఈ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. మొత్తానికి కలెక్షన్స్ విషయంలో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా భోళా శంకర్ నిలబడటం కష్టమే. కానీ ఇప్పటికే సండే వరకూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ రానున్నాయి. ఆల్ రెడీ టికెట్లు బుక్ అయిపోయాయి. కాబట్టి.. భోళా శంకర్ ఓపెనింగ్స్ కి డోకా లేదు.

Also Read:twitter review:భోళా శంకర్..బోర్ కొట్టిస్తుందా?

- Advertisement -