‘ భోగి ‘ పండుగ ప్రత్యేకత తెలుసా?

99
- Advertisement -

తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను ఒక ఉత్సవంలా జరుపుకుంటారు. అయితే మూడు రోజులలో ముందుగా వచ్చే భోగి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసుకుందాం !

భోగి అనేది భగ్ అనే పదానికి రూపాంతరంగా చెప్పుకోవచ్చు. భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. దక్షిణాయనానికి చివరి రోజుగా భావించే ఈ భోగి రోజు.. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి,రావి, వేప చెట్ల అవశేషాలు, తాటాకులు వంటివి భోగి మంటలలో వేస్తారు. అంతేకాకుండా ఇంట్లోని పాత వస్తువులను కూడా ఈ భోగి మంటలలో వేస్తారు. దక్షిణాయనంలో పడ్డ కష్టాలను, భాదలను, అగ్ని దేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలతో మెలగాలి అనేదే దాని సారాంశం. కాగా భోగి మంటలలో వేసే ఆవుపేడ వంటి వాటి వాళ్ళ కొన్ని ఆరోగ్య ప్రయోజనలు కూడా ఉన్నాయి. ఆవుపిడకలను కాల్చడం వాళ్ళ గాలిలో ఉండే సూక్ష్మజీవీలు నాశనం అవుతాయి. అంతే కాకుండా ప్రాణవాయువు కూడా అధిక శాతంలో విడుదల అవుతుంది.

ఇక బోగీ పండుగ రోజు సీజనల్ గా ప్రకృతి ప్రసాధించే రేగుపండ్ల ను పిల్లల తలపై పోయడం ఆనవాయితీగా వస్తోంది. రేగి పండ్లతో పాటు బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కూడా చిన్నపిల్లల తలపై పోస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది.. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా కౌమారంలోకి ప్రవేశించే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ భోగి పండ్లను పోస్తారు. ఇలా భోగి పండుగ రోజున పూర్వం నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూ సంక్రాంతి పండుగకు స్వాగతం పలుకుతారు.

Also Read:డెవిల్ ఓటీటీ డేట్ ఫిక్స్!

 

- Advertisement -