రివ్యూ: భీష్మ

3123
bheeshma movie review

యూత్ స్టార్‌ నితిన్ – క్యూట్ రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. కొంతకాలంగా హిట్టు కోసం పరితపిస్తోన్న నితిన్ భీష్మతో హిట్ కొట్టాడా…? ఛలో సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకీ కుడుముల మరోసారి ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

భీష్మ ఆర్గానిక్స్ అనే సంస్థను స్థాపించిన భీష్మ (అనంత్ నాగ్) పెళ్లి చేసుకోని బ్రహ్మచారి. తన సంస్ధను నడిపించే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు భీష్మ (నితిన్) విచిత్ర పరిస్థితిలో ఏసిపి దేవా (సంపత్ రాజ్)ను కలుస్తాడు. ఈ క్రమంలో అతని కూతురు (రష్మిక)ను ప్రేమిస్తాడు. కట్ చేస్తే తాను ఎదురుచూసే వ్యక్తి నితిన్‌ అని భావించిన అనంత్ నాగ్‌ 30 రోజులకు నితిన్‌ని సిఈవో చేస్తాడు. అసలు అనంత్ నాగ్‌ను భీష్మ ఎలా ఇంప్రెస్ చేశాడు…తర్వాత కంపెనీని ఎలా రన్ చేశాడు అన్నదే సినిమా కథ.

Image result for bheeshma

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ,నితిన్-రష్మికా జోడి,డ్యాన్స్‌,పాటలు. నితిన్ తన నటనతో ఇరగదీశాడు. చాలాకాలం తర్వాత తనకు తగ్గ పాత్రలో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశౄడు. నితిన్ డ్యాన్స్‌,కామెడీ టైమింగ్ సూపర్బ్. తన అందంతో సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లింది రష్మీకా. ముఖ్యంగా నితిన్‌- రష్మీకా జోడి సూపర్బ్. మిగితా నటీనటుల్లో సంపత్ రాజ్, బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ ,హెబ్బా పటేల్ ,జిస్సు సేన్ గుప్తా తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ వీక్ స్టోరీ, పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం. లవ్ స్టోరీ ఇంకొంచెం బాగా తీసి క్లైమాక్స్ ను ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే భీష్మ మరో లెవెల్ లో ఉండేది. సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొడుతుంది.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఛలో సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న వెంకీ కుడుముల మరోసారి తనబలం కామెడీనే నమ్ముకుని ముందుకుసాగాడు. మహతి సాగర్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ,ఎడిటింగ్ సూపర్బ్. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

Image result for bheeshma

విశ్లేషణ:

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌–వెంకీ కాంబోలో తెరకెక్కిన చిత్రం భీష్మ. నితిన్ నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా కథ మైనస్ పాయింట్‌. ఓవరాల్‌గా భీష్మతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నితిన్‌. సంక్రాంతి సినిమాల తర్వాత హిట్‌గా నిలిచే మూవీ భీష్మ.

విడుదల తేదీ: 21/02/2020
రేటింగ్:2.75/5
నటీనటులు: నితిన్,రష్మికా
సంగీతం:మహతి స్వర సాగర్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: వెంకీ కుడుముల