భీమ్లా నాయక్‌…ట్రైలర్ అదిరిందంతే!

45
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధానపాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చస్త్రశారు.

ట్రైలర్‌ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏంటి బాలాజీ స్పీడు పెంచావ్ అని ర‌ఘుబాబును రానా అడుగుతున్న స‌న్నివేశంతో ట్రైలర్ స్టార్ట్ కాగా పులి పెగ్గేసుకుని ప‌డుకుంది కానీ కాస్త స్లోగానే పోనియ్యు అని రానా రానా చెప్పగా స‌ర్దార్ భీమ్లా నాయ‌క్..స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్‌.. శ్రీశైలం త‌హ‌సీల్‌..కేశ‌వ‌రం మండ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అంటూ పవన్ ఇంట్రడ్యూస్ అయ్యే సీన్ హైలైట్. భీమ్లా నాయ‌క్‌, డానియ‌ల్ శేఖ‌ర్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగుండగా చివరగా తోలు తీస్తా నా కొడ‌కా అంటూ ప‌వ‌న్ స్టైల్ ఆఫ్ మేనరిజం అందరి చేత విజిల్స్ వేయించింది.

- Advertisement -