‘భీమ్లా నాయక్’ విడుదలకు ముహుర్తం ఖరారు..

143
- Advertisement -

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ రిలీజ్‌ విషయంలో ఉన్న గందరగోళం మొత్తానికి ముగిసింది. ఈ నెల 25న వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుక్, స్టైల్ జనాలను అకట్టుకుంటున్నాయి.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయిక. ప్రతినాయకుడిగా రానా నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. తమన్ స్వరకల్పనలో వచ్చిన భీమ్లా నాయక్ పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి ఇది రీమేక్‌గా రూపుదిద్దుకుంది.

- Advertisement -