‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి ఫిక్స్‌..

162
- Advertisement -

పవన్ కల్యాణ్,రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియుం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్నది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ కనిసించనున్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఇక ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం మరోసారి అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేసింది.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ‘జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. అయితే, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న రిలీజ్ చేస్తుండటంతో ‘భీమ్లా నాయక్’ పోస్ట్‌పోన్ చేస్తారనే వార్తలు వచ్చాయి. దాంతో ఎట్టిపరిస్థితూలోనూ ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసే సమస్యే లేదని క్లారిటీ ఇస్తూ 2022, జనవరి 12నే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

- Advertisement -