‘భీమ్లా నాయక్’ ఓవర్సీస్‌ కలెక్షన్స్‌..

137
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘భీమ్లా నాయక్’. ’ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. బాక్సాఫిస్‌ వద్ద ఈ సినిమా ఓ రేంజ్‌లో విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా భీమ్లా నాయక్ మానియా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ భీమ్లా నాయక్ ఓవర్సీస్ కలెక్షన్లను వెల్లడించారు.

ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. కాగా, ఈ చిత్రం అమెరికాలో గురువారం నాడు రూ.6.53 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. యూకేలో రూ.87.81 లక్షలు, ఐర్లాండ్ లో రూ.6.44 లక్షలు వసూలు చేసినట్టు వివరించారు. కాగా, భీమ్లా నాయక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పవన్ కెరీర్ లోనే పవర్ఫుల్ మూవీ అంటూ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.

- Advertisement -