భీమ్లా నాయక్’ 2వ రోజు వసూళ్లు..

84
- Advertisement -

పవన్ కళ్యాణ్,రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’.ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమాలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా అదరగొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ రెండు రోజు కూడా సత్తా చాటాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దానికితోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అస్సలు తగ్గడం లేదు భీమ్లా నాయక్.

మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఏపీలో మాత్రం చాలా చోట్ల షోలు ఆగిపోవడం.. టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు పవన్ సినిమాలకు వచ్చే వసూళ్ళు ఇప్పుడు రాలేదు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.14 కోట్లు.. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే.. మొత్తంగా రూ. 16.09 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రెండో రోజు ఏరియా వైజ్‌గా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

-నైజాం (తెలంగాణ): రూ. 19.33 కోట్లు / రూ. 35.00 కోట్లు
-సీడెడ్ (రాయలసీమ): రూ. 4.84 కోట్లు / రూ. 17.00 కోట్లు
-ఉత్తరాంధ్ర: రూ. 3.17 కోట్లు / రూ. 9.50 కోట్లు
-ఈస్ట్: రూ. 2.69కోట్లు / రూ. 6.50 కోట్లు
-వెస్ట్: రూ. 3.44 కోట్లు / రూ. 5.60 కోట్లు
-గుంటూరు: రూ. 3.16 కోట్లు / రూ. 7.20 కోట్లు
-కృష్ణా: రూ. 1.53 కోట్లు / రూ. 6.00 కోట్లు
-నెల్లూరు: రూ. 1.40 కోట్లు / రూ . 3.20 కోట్లు
-ఏపీ + తెలంగాణ: రూ. 39.56 కోట్లు (గ్రాస్ రూ. 58 కోట్లు) / రూ. 90.00 కోట్లు
-రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 4.35 కోట్లు / రూ. 10.50 కోట్లు
-ఓవర్సీస్:రూ. 8.55 కోట్లు / రూ. 9.00 కోట్లు
-వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 52.46 కోట్లు (గ్రాస్ రూ. 81.50 కోట్లు) / రూ. 109.50 కోట్లు

- Advertisement -