ఒక్కరోజు ముందుగానే ఓటీటీలో భీమ్లానాయక్!

111
naik
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సరిగ్గా నెల రోజులకు ఓటీటీ వేదికపైకి తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 25 నుంచి ఈ సినిమాను హాట్ స్టార్ డిస్నీతో పాటు ‘ఆహా’లో రిలీజ్ కానుందని ప్రకటించగా తాజాగా డేట్ చేంజ్ చేశారు. ఒక్కరోజు ముందుగానే హాట్ స్టార్ డిస్నీలో భీమ్లానాయక్ ప్రసారం కానుంది.

మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

- Advertisement -