జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ..!

50
rt
- Advertisement -

మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ’ కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు, ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP , RT టీమ్‌వర్క్స్ పై రూపొందుతోంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. తాజాగామూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.

Rama Rao on Duty Release on June 17యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు, వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీతో ఒక కీలక పాత్ర లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్ ISC నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

- Advertisement -