లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం- భవిత శ్రీ చిట్ ఫండ్ ఎండి

47
Bhavithasri Chit Funds

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన భవిత శ్రీ చిట్ ఫండ్ ప్రవైట్ లిమిటెడ్ ఎండి తాటిపెల్లి శ్రీనివాస్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో భవిత శ్రీ హాలిడే రిసార్ట్స్ , శారాజిపేట, ఆలేరులో లక్ష మొక్కలు నాటే లక్ష్యంగా ఈ రోజు మూడు మొక్కలుతో ప్రారంభించారు.

Bhavithasri Chit Funds Md

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఈ లక్ష మొక్కలలో 108 దైవ వృక్షాలను నాటుతానని, పది అంతస్తుల ఇంటిని ఒక సంవత్సర కాలంలో కట్టచ్చు కానీ ఒక చెట్టుని కనీసం మనం ఒక మూడు సంత్సరాలు కాపాడితే , అది మనకు వంద సంత్సరాలు మొక్కలు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో ఉన్న 50 బ్రాంచిల ద్వారా మొక్కలు నాటిస్తానని తెలియజేశారు. కోటి రూపాయలు పెట్టిన దొరకని మంచి గాలి, వాతావరణం కేవలం మొక్కల ద్వారా వస్తుందని, మొక్కలు విరివిగా పెంచాలని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.