ఇదే విధానం రావాలి..

255
Bhavana Wants To Do Female Centric Films
- Advertisement -

ద‌క్షిణాదిలో ప‌లు భాష‌ల్లో చిత్రాల్లో న‌టించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ హీరోయిన్‌ భావ‌న‌. తెలుగులో ఆమె ఒంటరి, హీరో, మహాత్మ, నిప్పు వంటి చిత్రాల్లో నటించిన నటిగా తెలుసు. గతంలో ఆమె అనేక వివాదాల్లో చిక్కకుని ఆ తర్వాత కన్నడ నిర్మాత నవీన్‌ను వివాహమాడింది.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె పీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల గురించి స్పందించారు. ఇప్పుడున్న సినిమా పరిశ్రమలో ‘‘హీరోల చుట్టూ తిరిగే కథల్లాగే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ కూడా ఎక్కువ రావాలి. అలా జరిగినప్పుడే హీరోయిన్‌లందరికి సరైన న్యాయం జరుగుతుందన్నారు.

Bhavana Wants To Do Female Centric Films

బాలీవుడ్‌లాగా మాలీవుడ్‌లోనూ మార్పు రావాలి’’ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమలో హీరోయిన్‌ వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తే అన్ని ఫీమేల్‌ కథలన్ని తనకే వెళ్లిపోతుంటాయి. కానీ బాలీవుడ్‌లో దీనికి విరుద్దంగా ఉంటుంది. అక్కడ స్టార్ హీరోయిన్లకు అందరికీ సమానమైన రీతిలో అవకాశాలు లభిస్తుంటాయి. ఇదే విధానం కూడా మన పరిశ్రమలో రావాలని అమె తెలిపారు.

- Advertisement -