9 రోజుల్లో 9 వేల కోట్లు:భట్టి

10
- Advertisement -

9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటివరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు.

ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించాం అన్నారు. ఈ సందర్భంగా రేపు 4 గంటలకు అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా సంబరాలు పెద్దఎత్తున చేపట్టాలి అని పిలుపునిచ్చారు.

పదిహేను ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది అన్నారు.

Also Read:కంచ గచ్చిబౌలి..విచారణ వాయిదా

- Advertisement -