- Advertisement -
చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సినీ నటి జయసుధ హాజరయ్యారు.
తెలుగు చిత్రాలు మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలను ప్రోత్సహిస్తాం అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ పేరుతో అవార్డులు ప్రధానం చేయడం హర్షణీయం అన్నారు భట్టి విక్రమార్క.
Also Read:కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటి..
- Advertisement -

