పీవీకి భారతరత్న..తెలంగాణకు గర్వకారణం

20
- Advertisement -

కుప్పకూల బోతున్న భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు గారు తన చివరి శ్వాస వరకు శ్రమించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన వేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుంది. గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నాం అన్నారు.

మా పోరాటాన్ని ప్రయత్నాన్ని సుదీర్ఘకాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఈదేశ వాసుల ఆకలి తీర్చేందుకు తన జీవితాంతం కృషచేసిన ms స్వామినాథన్ కు భారతరత్న దక్కడం హర్షణీయం.. దేశంలో వరి, గోధుమ పంటల సాగులో అదిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసి హరిత విప్లవాన్ని సాధించిన వ్యవసాయ శాస్త్రవేత్త అందరికీ ఆదర్శనీయుడు స్వామినాథన్ అన్నారు భట్టి.

రైతు సమస్యలపై ఈ దేశంలో మొదటిసారి గళం విప్పి పోరాడి రైతుల విజేతగా నిలిచిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారతరత్న దక్కడం శుభపరిణామం. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈదేశానికి చరణ్ సింగ్ గణనీయమైన సేవలు అందించారు. ఆయనకు భారతరత్న దక్కడం విలువలుగల, రైతు పక్షపాతిగా పోరాడే నాయకులకు స్ఫూర్తినిస్తుందన్నారు.

Also Read:ఈ వారం సినిమాల పరిస్థితేంటి?

- Advertisement -