రామ్ చరణ్, ఉపాసనా కొణిదెల హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి విమానం ఎక్కారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న దంపతులు వారి పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి డిపార్చర్ గేట్ వైపు వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.
ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ వెళ్తుండగా, ఓ మహిళా అభిమాని ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీ అడిగాడు. అయితే, ఆ జంట సెక్యూరిటీలో ఒకరు ఫ్యాన్ దగ్గరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ వెంటనే జోక్యం చేసుకుని, ఫ్యాన్‌ని దూరంగా నెట్టవద్దని తన సెక్యూరిటీ గార్డుకు సూచించాడు. రామ్ చరణ్ తన అభిమానుల పట్ల వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. శంకర్ భారతీయుడు 2 షూటింగ్ కోసం చెన్నై వెళ్లారు. రామ్ చరణ్ దుబాయ్ వెకేషన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత,గేమ్ ఛేంజర్ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈ లోపు శంకర్ భారతీయుడు 2 కి సమబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొస్తారు.
ఇవి కూడా చదవండి…