భర్త మహాశయులకు విజ్ఞప్తి..సెకండ్ సింగిల్

9
- Advertisement -

బెల్లా బెల్లా పాటతో ప్రేక్షకులను అలరించిన భర్త మహాసయులకు విజ్ఞప్తి చిత్రబృందం ఇప్పుడు ఓ మెలోడీని విడుదల చేయడానికి సిద్ధమైంది.

రెండో పాట “అద్దం ముందు” రవితేజ, డింపుల్ హయాతీపై చిత్రీకరించారు. ఈ పాట రిలీజ్ తేదీ డిసెంబర్ 10, 2025 అని ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు రానుంది.

సంక్రాంతికే సినిమా విడుదల కానుందని మేకర్స్ మరోసారి ధృవీకరించారు. ఈ బిగ్గీలో మరో హీరోయిన్ ఆశికా రంగనాథ్. సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

Also Read:తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి: జిష్ణు దేవ్

- Advertisement -