సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ శివాత్మిక, జీవిత రాజశేఖర్, నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, లగడపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..’భరతనాట్యం’ ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. చాలా ఆసక్తికరమైన కథ ఇది. చాలా మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారు. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఎడిటర్ రవితేజ నా ఫేవరేట్ ఎడిటర్. నిర్మాతలు పై పాయల్ సరాఫ్, హితేష్ గారికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. దొరసాని సినిమా మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, నేను, శివాత్మిక.. ఇలా దాదాపు అందరం కొత్తవాళ్లతో ఆ సినిమా చేశాం. ఆ సినిమా మా అందరి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచింది. ఇదే నమ్మకంతో చెబుతున్నా… ‘భరతనాట్యం’ సినిమా కూడా సూర్య తేజ తో పాటు సినిమా యూనిట్ అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కెవిఆర్ మహేంద్ర ని మా అన్నలా భావిస్తాను. కెవిఆర్ మహేంద్ర అన్న విషయంలో ఎప్పుడూ గర్వంగా ఫీలౌతాను. ‘భరతనాట్యం’ కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ధని ఏలే గారు పాతికేళ్ళు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న ..’భరతనాట్యం’, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వస్తున్నాయి. రెండు సినిమాలని చూసి ఎంజాయ్ చేయండి. అన్నీ సినిమాలు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మన ఇండస్ట్రీ బావుండాలి. మనమంతా బావుండాలి’ అన్నారు.
హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలని మా దర్శకుడు చెప్పేవారు. మా సినిమాకి ఆ నేచర్ హితేష్ గారు. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. మాపై చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. ‘భరతనాట్యం’ మా టీం సమిష్టి కృషి. వివేక్ సాగర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. ఎడిటర్ రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. డీవోపీ వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సురేష్ గారు చాలా మంచి ఆర్ట్ వర్క్ చేశారు. నాన్న (ధని ఏలే) గారు నా కంటే ఎక్కువ కష్టపడ్డారు. ఆయన పాతికేళ్ళుగా పరిశ్రమలో వున్నారు. పరిశ్రమలో ఆయన అందరిప్రేమని సంపాదించారు. డైరెక్షన్ టీంతో పటు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆనంద్, శివాత్మిక, జీవితగారు, నవదీప్ .. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పాయల్ గారి సపోర్ట్ వలనే ఇక్కడి వరకూ వచ్చాం. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. మీనాక్షి చాలా కష్టపడింది. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. దర్శకుడు కెవిఆర్ మహేంద్ర అన్న సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో ఆయనలోని వైలెన్స్ ని చూస్తారు. ఏప్రిల్ 5న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది.” అన్నారు.
Also Read:Heat Wave:హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్