బాలీవుడ్‌కు భరత్‌ అనే నేను..

241
- Advertisement -

మహేశ్ బాబు కథానాయకుడిగా ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు తెరకెక్కిస్తే ఎక్కువగా విజయాలు అందేవి కావని ఒక టాక్ ఉండేది. ముఖ్యంగా కొందరు స్టార్ దర్శకులైతే.. ఆ లైన్ ఎంచుకున్నారంటే వారు ఫెయిల్ అయినట్టే అని కూడా చెప్పారు. కానీ మెస్సేజ్ అందించే చిత్రాల్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తే తప్పకుండా నచ్చుతుందని కొందరు దర్శకులు నిరూపించారు. ముఖ్యంగా మన తెలుగులో ప్రస్తుతం కొరటాల శివ అదే తరహాలో కథలు రాసుకుంటున్నాడు.

Bharath Ane Nenu to be Dubbed in Bollywood

రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందో అందరికి తెలిసిందే. ఒక నాయకుడు ఎలా ఉండాలి. ఇచ్చిన వాగ్దానాలను హామీలను ఎలా నెరవేర్చుకోవాలనే పాయింట్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అంతే కాకుండా పాలిటిక్స్ లోని వివిధ అంశాలను అందరికి అర్థమయ్యేలా చాలా సున్నితంగా చూపించాడు.

అయితే ఇలాంటి సినిమా ఇప్పుడు పరబాషకు కూడా వెళితే మంచి టాక్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. ఒక సామాజిక అంశం కావడంతో ఇలాంటి కథలకు భాషాబేధం ఉండదు. అందుకే భరత్ అనే నేను సినిమాను ఇతర భాషల్లో డబ్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ – హిందీలో కూడా అనువదించదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ స్పెషల్ గా తెలియజేశారు.

- Advertisement -