వ‌చ్చాడ‌య్యో సామి సాంగ్ మేకింగ్ వీడియో…

457
bharatanenenu
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అనే నేను మూవీ భారీ విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. మ‌హేశ్ బాబు కెరీర్ లోనే ఈసినిమా పెద్ద హిట్ గా నిలవ‌డం విశేషం. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈసినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించగా..లిరిక్స్ ను రామ‌జోగ‌య్యశాస్త్రీ రాశారు. ఈసినిమాలోని పాట‌లు ఎంత పెద్ద హిట్ సాధించాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

VachadayyoSami

ఈసినిమాలో వ‌చ్చాడ‌య్యో సామి సాంగ్ చాలా పాపుల‌ర్ అయ్యింది. కైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడిన ఈపాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈసాంగ్ లో మ‌హేవ్ బాబు పంచెక‌ట్టులో క‌నిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈసాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు చిత్ర బృందం. 360డిగ్రిల కోణంలో ఈసాంగ్ ను షూట్ చేశారు. ఈ మేకింగ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కోడుతుంది. ఈమేకింగ్ సాంగ్ ను చూసి మ‌హేశ్ బాబు అభిమానులు ఆనందంవ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -