వాజపేయి మృతిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక..

310
- Advertisement -

భారతరత్న, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఆరోగ్యం.. బుధవారం మరింత క్షీణించింది. ఇవాళ సాయంత్రం 5.05 నిమిషాల‌కు వాజ్‌పేయి క‌న్నుమూసిన‌ట్లు ఎయిమ్స్ వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Atal Behari Vajpayee

జూన్ 11న ఆయ‌న్ను ఎయిమ్స్‌లో చేర్పించార‌ని, గ‌త 9 వారాలుగా ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, అయితే గ‌త 36 గంట‌ల్లో ఆయ‌న ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటిలేటర్ పై ఉంచాం. ఆయన ప్రాణాలను కాపాడటానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ… చివరకు ఆయనను దక్కించుకోలేక పోయాం. అని వైద్యులు నివేదిక విడుదల చేశారు.

AIIMS

- Advertisement -