15 రోజుల పాటు భారత్ పర్వ్ ఉత్సవాలు

8
- Advertisement -

15 రోజుల పాటు భారత్ పర్వ్ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు భారత్ పర్వ్ ఉత్సవాలు జరగనున్నాయి.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏకతా నగర్ వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పరేడ్ నిర్వహించబడుతుంది. తొలి పరేడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు అన్నారు. మొదటి భారత్ పర్వ్ పరేడ్లో శుక్రవారం ఉదయం 7:55 గంటలకు పాల్గొంటారని చెప్పారు. మోదీ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద పుష్పాంజలి అర్పించి, అనంతరం ‘రాష్ట్రీయ ఏకతా దివస్’ వేడుకల్లో పాల్గొంటారని షా వివరించారు.

అమిత్ షా మాట్లాడుతూ..మహాత్మా గాంధీతో కలిసి సర్దార్ పటేల్ భారత స్వాతంత్ర్య సమరానికి వెన్నెముకలుగా నిలిచారు. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అపారమైనది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్‌ను ప్రజల మతిలోంచి తొలగించేందుకు ప్రయత్నించింది అన్నారు. కాంగ్రెస్ 41 సంవత్సరాల పాటు సర్దార్ పటేల్‌కు భారత రత్న పురస్కారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని షా ఆరోపించారు. దేశానికి పునాది వేసిన ఆయన సేవలు అపారమైనవి అన్నారు.

Also Read:కేబినెట్ విస్తరణ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

- Advertisement -