మహిళా రిజర్వేషన్‌ బిల్లు..రౌండ్ టేబుల్ మీట్

78
- Advertisement -

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపే వరకు పోరాడతామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆకాశంలో సగం, ధరణిలో సగం,అవకాశంలో సగమని మహిళలకు సమానమైన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని…మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని పేర్కొన్నారు కవిత. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదని తెలిపారు. మహిళా బిల్లు ఆమోదం కోసం మొన్న జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దీనికి కొనసాగింపుగా ఇవాళ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నాం అని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, మహిళా సంఘ ప్రతినిధులతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని లే మెరిడియన్‌ హోటల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టాల్సిన అంశంపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -