- Advertisement -
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్ని తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ కీలకదశకు చేరుకోగా భారత్‌లో భారత్ బయోటెక్ రెండోదశ క్లీనికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కొవాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్‌లో జంతువులపై సత్ఫలితాలనిస్తోందని టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగ నిరోధక శక్తి భాగా అభివృద్ధి చెందిందని ట్విట్టర్‌లో పేర్కొంది.
వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ పెరిగింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించాము. రెండో డోస్ ఇచ్చిన 14రోజుల తర్వాత మరోసారి జంతువులను పరిశీలిస్తాం అని భారత్ బయోటెక్ తెలిపింది.
- Advertisement -