‘భరత్ బహిరంగ సభకు యంగ్ టైగర్’..

300
Bharat Anu Nenu Pre Release
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పూర్తిస్థాయి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రేపు (ఏప్రిల్ 7న) సాయంత్రం జరగనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

‘భరత్ బహిరంగ సభ’ అంటూ ట్వీట్ చేసిన చిత్ర యూనిట్, భరత్ బహిరంగ సభ నమూనాను గ్రాఫిక్స్ రూపంలో చూపింది. కాగా, ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్యఅతిథులుగా వస్తారనే వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, జూనియర్ఎన్టీ ఆర్ ఒక్కడే హాజరవుతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. ‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్’ అని రాసి ఉన్న ఆ పోస్టర్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తున్నారు.

- Advertisement -