భారీ రేటుకు “భరత్‌ అను నేను”…

187
Bharat Anu nenu" movie Hindi rights sold out
- Advertisement -

ఇప్పటికే స్పైడర్ మూవీ కంప్లీట్ చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నాన్‌స్టాప్‌గా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. కొరటాల శివతో ఇప్పటికే మూవీ మొదలు పెట్టిన మహేష్.. ఆ తర్వాత పైడిపల్లితో సినిమా చేయాడానికి రెడీ అవుతున్నాడు. మహేష్‌కు ఇది 25వ సినిమా. ఇదిలాఉండగా మహేష్ తన 26 వ సినిమా కూడా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అది కూడా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇలా మహేష్‌ చక చక సినిమాతో దూసుకుపోతున్నాడు.

Bharat Anu nenu" movie Hindi rights sold out

అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ ఈ సినిమా హిందీ ఆల్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ని మినహా ఇస్తే మరే సినిమాకి ఈ స్థాయి రేటు రాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట.

మరి ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 18 నుంచి 20 కోట్లకు దక్కించుకోవడానికి రెండు భారీ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఈ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారనేది రెండు మూడు రోజుల్లో తెలియనుంది. గతంలో కొరటాల – మహేశ్ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ భారీ విజయాన్ని అందుకోవడం, కొరటాల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ రావడం ఈ స్థాయి రేటు పలకడానికి ప్రధానకారణంగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

- Advertisement -