‘భ‌ర‌త్ అనే నేను’.. ఐ డోంట్ నో.. ఫుల్ వీడియో సాంగ్‌

308
Bharat Ane Nenu Movie Full Video Song
- Advertisement -

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక మే 25న త‌మిళ‌నాట భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో విడుద‌ల కానుంది.

ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో డ‌బ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25న భ‌రత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమీన్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదలచేయనుంది. ఈ రెండు రాష్ట్రాల‌లో కూడా మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుందని టీం భావిస్తుంది.

Bharat Ane Nenu Movie Full Video Song

అయితే కొద్ది సేప‌టి క్రితం ఐ డోంట్ నో అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు. బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఈ పాట‌ పాడ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. భ‌ర‌త్ అనే నేను చిత్రంలో శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో క‌నిపించారు. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందింది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా తర్వత వంశీ పైడిపల్లి మూవీలో చేయనున్నాడు.

- Advertisement -