మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తుంది. ఇందులో హీరోయిన్‌గా కైరా అద్వాని హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. పూర్తి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంటుంది.
విడులకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసి విడుదల అనంతరం కూడా అంచనాలకు తగ్గకుండా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇక విషయానికొస్తే ఈ సినిమా ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ డిలీట్ చేశారు. ఈ డిలీట్ చేసిన సన్నివేశాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్.
తాజాగా సినిమాలోని సీఎం భరత్ రైతుతో మాట్లాడే సీన్‌ను విడుదల చేశారు. ఈ సీన్ చూస్తే హృదయాన్ని కదలించేలా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. రైతుల దయనీయ స్థితిని దర్శకుడు ఇ సీన్‌తో చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సీన్‌లోకి వెళితే…వర్షం పడితే సరే.. పడకపోతే ఏం చేస్తావు’ అని రైతును సీఎం అడగ్గా.. ‘భగవంతుడి మీద భారం వేసి పైకి చూడటమే.. పడితే సరి.. భగవంతుడి మీద భారమేసి పైకి చూడటమే.. లేకపోతే రెండు చుక్కలు తాగి ఆయన దగ్గరకు పోవడమే’ అంటూ రైతు చెప్పే మాటలు రైతులు ఆవేధనకు అద్దం పడుతుంది.