బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటించగా తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కింది.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది.
Also Read:ఫిష్ వెంకట్‌కి విశ్వక్ సేన్ సాయం
తెలుగుతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచిచూడాలి.

