నాలుగు భాషల్లో ఆర్జీవీ…’బైరవగీత’

422
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయిన వర్మా.. “బైరవగీత” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నూతన దర్శకుడు టి. సిద్ధార్థ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  మూవీలో కన్నడ నటుడు ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటించగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 22న నాలుగు భాషల్లో విడుదల కానుంది.

యధార్థ సంఘటనల ఆధారంగా రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రేమ కథ కాన్సెప్ట్ తో  తెరకెక్కుతుండగా  ఏకకాలంలో కన్నడ, తెలుగు ,తమిళం, హిందీలో రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -