నవంబర్ 30న ‘భైరవగీత’..!

189
- Advertisement -

ధనంజయ మరియు ఇర్రా మోర్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలలో నవంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..

Bhairava Geetha

నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్ ..సాంకేతిక నిపుణులు :దర్శకుడు: సిద్ధార్థ తాతోలు,నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి,సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ, సంగీత దర్శకుడు : రవి శంకర్,కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ,సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a,ఎడిటర్: అన్వర్ అలీ.

- Advertisement -