పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా, ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తీసుకువచ్చిన మానసపుత్రిక గ్రీన్ ఇండియాఛాలెంజ్ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. తాజాగా బైంసా ఏఎస్పీ కిరణ్ కారే కుబీర్ పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కూమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన భైంసా ఏఎస్పీ కిరణ్ కారే కుబీర్ పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని బైంసా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన భైంసా ఎఎస్పీ కుబీర్ పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో ఋతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈకార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహితమైన వాతావరణం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ బొర్కడే ఐఏఎస్, అడిషనల్ డీసీపీ బాన్సడే యోగేష్ గౌతమ్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ వరంగల్ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్‌లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు.
ఈ కార్యక్రమంలో భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్, కుభీర్ ఎస్ ఐ షరీఫ్, భైంసా రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, కుంటల ఎస్ఐ సుమంజలి, కుబీర్ సర్పంచ్ విజయ్ కుమార్, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.