అత్యాచారాలు జరగడానికి ఆడవాళ్లే కారణం..

621
Bhagyaraja
- Advertisement -

తమిళంలో విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న భాగ్యరాజా.. తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ‘కరుత్తుగులై పుదిఉసెయ్’ సినిమా ట్రైలర్ లాంఛ్‌లో ఆయన ఆడవాళ్ల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

వివాహేతర సంబంధాల కోసం ఈరోజుల్లో మహిళలు భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారని.. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని.. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని భాగ్యరాజా అన్నారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణమని అయన వ్యాఖ్యానించారు. పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

director bagyaraja

పొల్లాచ్చి అత్యాచారం ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదని భాగ్యరాజా చెప్పారు. ఆ అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినందువల్లే తన సినిమాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చానని చెప్పారు.మరోవైపు, భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే… పురుషుల తప్పేమీ లేదని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

https://twitter.com/api_sha/status/1199351193878880256

tamil actor cum director bhagyaraj controversial comments on womens behavior.. tamil actor cum director bhagyaraj controversial comments on womens..

- Advertisement -