ఈ రోజు బాలయ్య ‘భగవంత్ కేసరి’, తమిళ స్టార్ హీరో ‘లియో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఈ సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. మరి వీటి పరిస్థితి ఏమిటో చూద్దాం రండి. ముందుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమా విషయానికి వద్దాం. ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ఫీస్ట్ అనే చెప్పాలి. న్యూ లుక్‌లో బాలకృష్ణ అదిరిపోయారు. తమన్ బీజీఎమ్ సూపర్బ్ గా ఉంది. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. కామెడీ సీన్లు, బాలయ్య డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కాకపోతే, స్టోరీ నెరేషన్ చాలా ఫ్లాట్ గా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యాయి.
ఇక మరో సినిమా విషయానికి వస్తే.. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన సినిమా లియో. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఫరవాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా సాగదీసినట్టు ఉంది. కాగా విజయ్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా ఈ సినిమా పరవాలేదు. కానీ, తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇటు తెలుగులోనే కాదు, అటు తమిళంలో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ లియో సినిమాకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ రోజు థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రానికి బెనిఫిట్ షోలను తమిళ నాడు ప్రభుత్వం రద్దు చేసింది. తొలిరోజు తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతించాలని కోరగా.. నిరాకరించింది. ఉదయం 7 గంటల షోను కూడా రద్దు చేసింది. దీంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. మొత్తమ్మీద విజయ్ సినిమాకు నష్టాలు మిగిలేలా ఉన్నాయి. ఓవరాల్ గా పోటీలో విజయ్ – బాలయ్య లలో బాలయ్యే నెగ్గాడు.
Also Read:KTR:కాంగ్రెస్‌ది బస్సుయాత్ర కాదు తుస్సుయాత్ర