భగవంత్ కేసరి..ఫ్యాన్స్‌కు పండగే

32
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి. యునిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతుండగా బాలకృష్ణ మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఆగస్టు మూడో వారం నుంచి భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ నుంచి నందమూరి ఫ్యాన్స్ కి ఫీస్ట్ స్టార్ట్ అని చెప్పాలి.

Also Read:సీనియర్స్ కు చెక్ పెడుతున్న జూనియర్స్?

- Advertisement -