వయస్సుతో పనిలేదు ఆత్మబలం ఉంటే చాలు

88
Bhagwani Devi
- Advertisement -

యుక్త వయస్సులో జాతీయ స్థాయిలో స్వర్ణం తెవడం గొప్పలు చెప్పుకుంటారు. కాని 94ఏళ్ల బామ్మ గారికి స్వర్ణం రావడం ఆశ్చర్యంగా ఉండవచ్చు కాని ఇదీ నిజం అమె పేరు భగవానీ దేవి దాగర్‌….. ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న 2022వ వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో భారత్‌ తరపున స్వర్ణం గెలుచుకొంది. అంతకుముందు చెన్నైలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌లో భగవానీ దేవి మూడు బంగారు పతకాలు గెలుచచుకొవడం ద్వారా, ఫిన్‌లాండ్‌లో జరిగే ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించిది. ఆమె వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో 24.74 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మరియు షాట్‌పుట్‌లో ఆమె కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకుంది.

- Advertisement -