క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్ తో జాగ్రత్త !

139
- Advertisement -

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతీది కూడా డిజిటల్ అయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తరువాత ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. ఏదైనా వస్తువులు కొనడం మొదలుకొని.. బ్యాంకింగ్ లావాదేవీల వరకు ప్రతీదీ కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే చేస్తున్నాము.ఈ నేపత్యంలో టెక్నాలజీ ఏ స్థాయిలో పెరుగుతోందో అంతే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనం ఇతరులకు నగదు పంపించాలన్న లేదా ఇతరుల నుంచి మనం నగదు పొందాలన్న క్యాష్ లెస్ పేమెంట్స్ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాము. .

ఈ విధానంలో యుపిఐ ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా నగదు పొందడం లేదా పంపించడం చేస్తూ ఉంటాము. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా క్యూ ఆర్ కోడ్ ల ద్వారా ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా షాప్ లో మనకు కావలసిన వస్తువు కొనుక్కొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ అమౌంట్ షాప్ అతనికి చెల్లిస్తూ ఉంటాము అయితే కేటుగాళ్ళు షాప్ ల యొక్క క్యూ ఆర్ కోడ్ లలో చిన్న చిన్న మార్పులు చేసి నగదు కొట్టేస్తున్నారు. ఇక అలాగే మెయిల్స్ ద్వారా లేదా మెసేజ్ ల ద్వారా అనౌన్ లింక్స్ ద్వారా క్యూ ఆర్ కోడ్ లు పంపించి.. ఆ కోడ్ లను స్కాన్ చేసిన వారి అకౌంట్లో నగదు మాయం చేస్తున్నారు. అందువల్ల ఏదైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ సూచనలు ఏంటో ఒకసారి చూద్దాం. !

* ఏదైనా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసేటప్పుడు ముందుగా ఆ క్యూ ఆర్ కోడ్ ను తీక్షణంగా పరిశీలించి.. మనం నగదు పంపించవలసిన వ్యక్తి లేదా షాప్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

* మనం నగదు పొందాల్సినప్పుడు ఎలాంటి స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బు పంపించాల్సిన సమయంలోనే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

* అలాగే మనం డబ్బు పొందాలిసినప్పుడు.. మన బ్యాంక్ ఖాతా కు సంబంధించిన పిన్ నెంబర్ లేదా ఓటిపి నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం డబ్బు ఇతరులకు పంపించాల్సి ఉన్నప్పుడే వీటి అవసరం ఉంటుంది.

ఈ కనీస సూచనలను గుర్తించుకోవడం వల్ల క్యూ ఆర్ కోడ్ లేదా యుపిఐ మోసల బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -