ఫోన్ అప్డేట్ చేస్తున్నారా.. జాగ్రత్త !

55
- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఎందుకంటే మనరోజువారి కార్యకలాపాలలో స్మార్ట్ ఫోన్ తో చేసే పనులే ఎక్కువ.. ఏదైనా ఆన్లైన్ లో కొనుక్కోవడానికి, ఏదైనా షాప్ లో పేమెంట్ చెల్లించడానికి, బ్యాంకింగ్ లావాదేవీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ తో చేసే పనులే అనేకం. అందువల్ల చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువ రోజులు వాడడం వల్ల దాని పర్ఫమెన్స్ తగ్గిపోతుంది. .

అలాంటి సందర్భాలలో ఏదైనా బ్రౌజ్ చేయాలన్న, ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్న నెట్ ఎంతో స్లోగా ఉంటుంది. అలాంటి సమయాల్లో చాలమంది మొబైల్ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే మొబైల్ రీస్టార్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని సంబర్బల్లో స్లో పర్ఫామెన్స్ చూపిస్తుంది. దానికి కారణం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం. మొబైల్ కంపెనీలు అప్పుడప్పుడు లేటెస్ట్ వెర్షన్ లను అప్డేట్స్ ద్వారా మొబైల్ కి ఇస్తూ ఉంటాయి. అప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల మొబైల్ స్పీడ్ పెరగడంతో పాటు ఫర్ఫమెన్స్ కూడా పెరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్స్ వల్ల కూడా ఇబ్బంది ఎదుర్కొక తప్పదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో కొత్త ఫీచర్లతో పాటు కొన్ని కొన్ని బగ్స్ కూడా వస్తుంటాయి.

ఆ బగ్స్ కారణంగా మొబైల్ తొందరగా వేడెక్కడం, యాప్స్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అవ్వడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ బగ్స్ ఫిక్స్ కావడానికి నెక్స్ట్ అప్డేట్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈలోపు ఫోన్ వాడకం మనకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల ఫోన్ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ చేయకుండా అప్డేట్ ద్వారా ఏమేమి ఫీచర్స్ ఇవ్వబోతున్నారో కులాంకుశంగా తెలుసుకోని.. ఆ ఫీచర్లు మీ వాడకాన్ని బట్టి ఎంతవరకు అవసరం అవుతాయో తెలుసుని, ఆ తరువాత ఫోన్ అప్డేట్ చేయడం మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫోన్ అప్డేట్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన.

ఇవి కూడా చదవండి..

- Advertisement -