- Advertisement -
హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుందని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు.
సిట్ కమిటీలో సభ్యులుగా ఐజీ ఎం.రమేష్‌తోపాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్‌లను సభ్యులుగా నియమించారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై టాలీవుడ్, బాలీవుడ్ నటులతోపాటు యూట్యూబర్స్, టీవీ యాంకర్లు 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేశారు.
Also Read:ప్రవాసీ మిత్ర..గల్ఫ్ భరోసా
- Advertisement -