- Advertisement -
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురిని విచారించారు పోలీసులు. ఇక పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ హైకోర్టులో దాఖలు చేశారు.
ఇవాళ పంజాగుట్ట పోలీసుల ఎదుట మరోసారి విచారణకు విష్ణుప్రియ హాజరు కావాల్సిఉన్న నేపథ్యంలో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల కూడా సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచించింది.
Also Read:ఆదిత్య 369..రీ రిలీజ్ డేట్!
- Advertisement -