రివ్యూ: బేతాళుడు

277
Bethaludu movie Review
- Advertisement -

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చ‌గాడు తో స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు. ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని.. తాజాగా బేతాళుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదల తేదీకి ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేతాళుడుతో విజయ్ అంటోని ఆకట్టుకున్నాడా..?బిచ్చగాడు రేంజ్ హిట్ అందుకున్నాడా..?చూద్దాం

కథ :

దినేష్(విజయ్ ఆంటోనీ) అనే ఒక ఇంటెలిజెంట్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నట్టుండి ఒక మానసిక రుగ్మతకు గురై ఎవరో తనను వెంటాడుతున్నట్టు భాధపడుతుంటాడు. పూర్వ జన్మ జ్ఞాపకాలకు, ప్రస్తుతానికి మధ్య నలిగిపోతుంటాడు. ట్రిట్ మెంట్ కోసం డాక్టర్‌ని కలవగా ఆ డాక్టర్ దినేష్ ను పరీక్షించి అతను తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని నిర్ధారిస్తాడు. అలా బాధపడుతున్న దినేష్ తన గత జన్మకు చెందిన జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళతాడు..అసలు ఈ జయలక్ష్మీ ఎవరు..?నిజంగానే దినేష్ గత జన్మ జ్ఞాపకాలతో బాధపడుతున్నాడా..?చివరికి కథ ఎలా సుఖాంతమైందో తెరపై చూడాల్సిందే.

Bethaludu movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విజయ్ అంటోని, ఫస్టాఫ్‌. విజయ్ ఆంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై చాలా సున్నితంగా చూపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హర్రర్ సినిమా చూస్తున్నామా అనే భావన కలిగింది. విజయ్ అంటోని తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ ఆమె గురించి తెలుసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత జన్మలోని శర్మ పాత్రకు మధ్య ఆంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ క్లైమాక్స్. సెకండాఫ్ లో నడిచే ఆంటోనీ గత జన్మ కథ బాగానే ఉన్నా అది ప్రస్తుతానికి వచ్చి పూర్తిగా వేరే ట్రాక్ తీసుకోవడం అంతగా నచ్చలేదు.మధ్యలో వచ్చే కొన్ని పాటలు కాస్త బోరుకొట్టించాయి. సినిమా ప్రీ క్లైమాక్స్ ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. దర్శకుడిచ్చిన ముగింపు సరైనదే అయినా సాధారణ ప్రేక్షకుడు ఆశించే రీతిలో లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి, సంగీత దర్శకుడు విజయ్ అంటోని. ఫస్టాఫ్ ఓపెనింగ్, కథనాన్ని స్క్రీన్‌పై తెరకెక్కించడంలో దర్శకుడు వందశాతం సక్సెసయ్యాడు. సెకండాఫ్ లో ఆంటోనీ గత జన్మ కథను, మొత్తం కథనాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. విజయ్ ఆంటోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, జయలక్ష్మి అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ చాలా బాగా కనెక్టయ్యాయి. ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ బాగుంది. షూటింగ్ కోసం ఎంచుకున్న లొకేషన్లను బాగా చూపించాడు. ఎడిటింగ్ సినిమాపై క్లారిటీ ఉండేలా చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Bethaludu movie Review

తీర్పు :

భిన్నమైన కథలను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించే విజయ్ ఆంటోని చేసిన మరో ప్రయోగమే ‘భేతాళుడు’. ఫస్టాఫ్ కథ, కథనాలు, విజయ్ ఆంటోనీ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా…సెకండాఫ్ కథనం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్ లు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వైవిధ్యాన్ని కోరుకునే ప్రేక్షకులకు నచ్చే సైకలాజికల్ థ్రిల్లర్ బేతాళుడు.

విడుదల తేదీ:01/12/2016
రేటింగ్: 3/5
నటీనటులు: విజయ్ ఆంటోని, అరుంధతినాయర్
సంగీతం: విజయ్ ఆంటోని
నిర్మాత: కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్
దర్శకత్వం: ప్రదీప్ కుమార్

- Advertisement -