1.సూక్ష్మ జీవులను నశింపజేసే సహజ సిద్దమైన గుణాలను కలిగి ఉండే కొబ్బరి నూనె చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దురదలున్న చోట కొబ్బరి నూనె ను పూసి గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం కలుగుతుంది.
2.వేప చెట్టు ఉత్పత్తుల్లో యాంటీ బ్యాక్టీరియా ,యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. అందువల్ల చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు ,మొటిమలకు, గజ్జి ,తామర వ్యాధులను తగ్గించుకోడానికి వేప ఉపయోగపడుతుంది.
3.తేనె చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది, చర్మం పగుళ్ళకు గురైనపుడు, ఇతర అన్ని చర్మ సమస్యలకు ఔషదంగా వాడవచ్చు. ముఖ్యంగా మొటిమలు పగిలినపుడు, తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడితే మంచిది
Also Read: ఇంట్లోనే నేచురల్ హెయిర్ ప్యాక్స్!
4.నిమ్మకాయ విటమిన్ ‘C’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. చర్మ సమస్యలను కలిగి ఉన్నట్లు యితే నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
5.కలబంద వృక్షం చర్మం పైన కలిగే చిరాకులు మరియు కలిగే దురదల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబందను చర్మం పైన కలిగే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించే ఒక గొప్ప ఔషదంగా చెప్పవచ్చు.
6.పొప్పడి పండు పుష్కలంగా విటమిన్ ‘A’ మరియు ‘పపాయిన్’లను కలిగి ఉండి, చర్మంలో నిర్జీవ కణాలను తోలగించటమే కాకుండా చైతన్య రహిత ప్రోటీన్’లను విచ్చిన్నం చేస్తుంది. పచ్చి పొప్పడి పండు గుజ్జును చర్మానికి వాడటం వలన చర్మం పైన ఉండే నల్లటి వలయాలు మరియు మొటిమలు తగ్గుతాయి.
7.సరైన మొత్తంలో నీటిని తాగటం వలన, రక్త ప్రసరణలో ఉండే హానికర పదార్థాలను మరియు విష పదార్థాలను తోలగిస్తుంది. ఈ విష పదార్థాల వలన చర్మాన్ని పగిలేల చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటేడ్’గా ఉంచుకోవటం వలన మీ చర్మం నుండి ఆయిల్ వేరు చేయబడుతుంది. అంతేకాకుండా, నీరు మీ చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.
Also Read:Uttam:ప్రాధాన్యాత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలు