69 వ నేషనల్ అవార్డ్స్ ను ప్రభుత్వం ప్రకటించచింది.. 2021 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు గాను అవార్డుల ప్రకటన చేశారు. ఇక ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్.. ఉత్తమ సినిమాగా ఉప్పెన.. ఆరు విభాగాల్లో ఆర్ఆర్ఆర్.. నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను చాటిచూపించారు.
ఈ నేపథ్యంలోనే 2021 సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమా చార్యులు అని ప్రకటించారు. దీంతో అసలు ఎవరు.. ఈ పురుషోత్తమా చార్యులు అని నెటిజన్స్ గూగుల్ చేయడం మొదలుపెట్టారు. కానీ, ఆయన ఫోటో కాదు కదా.. పేరు కూడా దొరకలేదు. దీంతో పురుషోత్తమా చార్యులు ఎవరు.. ? ఏం వ్యాసాలు రాశారు.. ? ఎక్కడి వారు అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.
Also Read:మెట్ లైఫ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. పురుషోత్తమా చార్యులు.. మిసిమి అనే మాస పత్రికలో వ్యాసాలు రాస్తున్నారు. ఆయనది నల్లగొండ. గత రెండేళ్లుగా మిసిమి మాసపత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పురుషోత్తమా చార్యులు చాలా పరిశోధనలు చేశారట. ఇక ముఖ్యగా 2021 సంవత్సరంలో ఆయన రాసిన వ్యాసాలను మెచ్చి ప్రభుత్వం ఆయనకు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డును అందించారు. దీంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ అవార్డు వరించాకా పురుషోత్తమా చార్యులు బాగా ఫేమస్ అయిపోతారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Also Read:ఇస్రో టీంకు తెలుగు ఫిలిం ఛాంబర్ విషెస్..