పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతు కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కొత్త సంవత్సర వేడుకలకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే టక్కున గుర్తొచ్చేది గోవా. సన్ బర్న్ ఫెస్టివల్ ఇక్కడ స్పెషల్. డీజే సౌండింగ్‌తో ఫుల్ నైట్ పార్టీతో ఉదయం వరకూ జోష్ లో ఉండి బీచ్ లో ఈతగొట్టేందుకు అంతా ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని గోవాలో సెలబ్రేట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు.
ఇక దేశరాజధాని ఢిల్లీలో సైతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదిరిపోవాల్సిందే. చారిత్రక సంపద, చక్కటి ఆహారం అందించే రెస్టారెంట్లు టూరిస్టులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. మంచు దుప్పట్లతో కప్పి ఉన్న మనాలికి న్యూ ఇయర్‌కి రా రమ్మని పిలుస్తోంది.
చక్కటి లొకేషన్లు, లోయలతో కొడైకెనాల్ సైతం ప్రత్యేకతను సంతరించుకుంది. గోవాకు పోటీగా పుదుచ్చేరికి కూడా పెద్దసంఖ్యలో టూరిస్టులు తరలివస్తారు. తక్కువ ధరకే మద్యం దొరకడంతో పాటు కేఫ్‌లు,బార్లు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.
రాజస్ధాన్‌లోని ఉదయ్ పూర్, కర్నాటకలోని గోకర్ణ సైతం నూతన సంవత్సర వేడుకలకు సిద్దమవుతోంది. ముఖ్యంగా గోకర్ణ ఆధ్యాత్మిక నగరమే కాదు బీచ్ లవర్స్‌కి స్వర్గాన్ని గుర్తుకు తెస్తుంది. మొత్తంగా పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ అంతేస్ధాయిలో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు.