పోచంపల్లి చేనేత చీర భేష్…బెంగాల్ ఎంపీ ప్రశంసలు

169
mp
- Advertisement -

పోచంపల్లి చేనేత చీర పైన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన లోక్ సభ సభ్యురాలు మొహువ మోయిత్రా ప్రశంసలు కురిపించారు. భారతీయ చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయన్న ఆమె, పోచంపల్లి చీర అందాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

గత వారం హైదరాబాదులో పర్యటించిన ఐటీ పైన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మంత్రి కే.తారకరామారావు తెలంగాణ ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాలను అందించారు.పోచంపల్లి చేనేత వస్త్రాలను తన ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన ఎంపీ మొహువ మోయిత్రా కు మంత్రి కే. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -