- Advertisement -
సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతునే ఉన్నాయి. తాజాగా బెంగాలి నటి అండ్రిలా శర్మ గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఆమె వయస్సు 24. చిన్న వయసులోనే గుండెపోటుతో ఆండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.
బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ నెల 1న ఆసుపత్రిలో చేరిన ఆండ్రిలా ఆదివారం తుది శ్వాస విడిచింది. పలుమార్లు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందింది.
పశ్చిమ బెంగాల్ లోని బెర్హం పూర్ లో జన్మించిన ఆండ్రిలా.. జమూర్ తో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహాపీట్ తారపీట్, జిబోనే జ్యోతి, జియోన్ కతి వంటి షోలతో పాటు అమీ దీదీ నెంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లోను నటించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -