సిక్స్ ప్యాక్‌తో వస్తున్న రాక్షసుడు..!

910
bellamkonda srinivas
- Advertisement -

సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన శ్రీనివాస్ ..ఇటీవల కాస్త డిఫరెంట్‌గా సీత,రాక్షసుడు మూవీలతో మెప్పించారు. ఇక రాక్షసుడు సినిమాలో శ్రీనివాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా రభస,కందిరీగ వంటి సినిమాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయ్యాడు బెల్లంకొండ. వచ్చె నెలలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీనివాస్ షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది.

తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నానని దీనికి #MondayMotivation అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. శ్రీనివాస్‌ లుక్‌ స్టన్నింగ్‌గా ఉంది. సిక్స్ ప్యాక్‌…గడ్డంలో ఉన్న తమ హీరోని చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్‌..

Bellamkonda Srinivas six-pack again..The film will be directed by Santosh Srinivas of ‘Rabhasa’ and ‘Kandireega’. The film will hit the floors next month

- Advertisement -