అందరికి నచ్చే… బెల్లంకొండ ‘కవచం’

285
bellamkonda srinivas
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ కవచం ‘.. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న విడుదల అవుతుంది.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆడియో వేడుకను భీమవరంలో ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు చాల థాంక్స్.. నేను ఈపోజిషన్ లో ఉన్నానంటే మీ అందరు సపోర్ట్ కారణం.. ఈ సినిమా కి పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. డిసెంబర్ 7 న ఈ సినిమా ని చూసి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు..

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన భీమవరం ప్రజలకు చాల థాంక్స్.. నాతో ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి చాలా థాంక్స్.. ఇంత మంచి కథను నెక్ట్స్‌ లెవెల్ లోకి తీసుకెళ్లిన చోటాగారికి, మిగితా టెక్నిషియన్స్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా అవుట్ ఫుట్ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ నవీన్ కి చాలా చాలా థాంక్స్.. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను.. ఈ నమ్మకం నేను మర్చిపోను. డిసెంబర్ 7 న సినిమా రాబోతుంది అందరు ఈ సినిమా చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను.. మీ ప్రేమ నమ్మకం కోసం ఇంకా ఇంకా కష్టపడతానని అన్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ. నాకు ఎనర్జీ హీరోలంటే చాలా ఇష్టం.. సాయి కూడా నా ఎనర్జీ హీరోల లిస్టులో ఉన్నాడు. సాయి తో పనిచేయాలని చాల రోజులనుండి ఉంది.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. ఈ సినిమా కి పనిచేస్తున్నందుకు చాల హ్యాపీ గా ఉందన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరికి ధన్యవాదాలు.. ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , బెల్లంకొండ సురేష్, ప్రొడ్యూసర్ నవీన్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా కి హీరో సాయి శ్రీనివాస్ గారు ఇచ్చిన కో ఆపరేషన్ చాలా గొప్పది.. కాజల్ గారు చాల బాగా నటించారు.. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.. మా టీం అందరు చాల కష్టపడి పనిచేసారు.. అందరికి థాంక్స్ అన్నారు

మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

- Advertisement -